ఆజాద్​ హ్యాండ్​ ఇచ్చి.. తిరిగి కాంగ్రెస్​ గూటికి మాజీలు

By udayam on January 7th / 5:39 am IST

సీనియర్ రాజకీయ నేత గులాం నబీ ఆజాద్..కాంగ్రెస్ పార్టీ ని వీడి..సొంతంగా ‘డెమొక్రటిక్​ ఆజాద్ పార్టీ’ పేరుతో ఓ రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆజాద్ తో ఉండడానికే మొగ్గు చూపిన కాంగ్రెస్ నేతలు ఆయన పార్టీలో చేరడం అప్పట్లో కలకలం రేపింది.. ఇక ఇప్పుడు ఆజాద్ ను వద్దనుకుని వారలతా తిరిగి సొంత గూటికే వచ్చేసారు. ఇలా ఏకంగా 17 మంది తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. ఈ నెల 20న జమ్ముకశ్మీర్​కు చేరనున్న నేపధ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్​