మచ్చ తెచ్చే పని చేయలేదు : ఈటెల

By udayam on May 3rd / 7:09 am IST

సిఎం కెసిఆర్​తో 19 ఏళ్ళకు పైగా పనిచేసిన తాను పార్టీకి, తనకు మచ్చ తెచ్చే పనిని ఎన్నడూ చేయలేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్​ వెల్లడించారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన తన గురించి తెలుసు కాబట్టే మంత్రిగా, ఫ్లోర్​ లీడర్​గా కెసిఆర్​ అవకాశం ఇచ్చారని, అదే కెసిఆర్​ ఇప్పుడు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదంతా చాలదన్నట్లు ఇప్పుడు తనపై వేలాది ఎకరాలు కబ్జా చేసినట్లు అసత్య ప్రచారారానికి తెరలేపారన్న ఆయన రాజ్యం మీదైనంత మాత్రాన నేను చేయని తప్పుకు శిక్షించడం కరెక్ట్​ కాదని, చట్టం అంటూ ఒకటుందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​