సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్

By udayam on November 17th / 5:20 am IST

కొవిడ్​ కాలం నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాస్​ ఒకరిది. రోజూ అప్డేట్స్​ ఇస్తూ జనాల్ని మోటివేట్​ చేసిన ఆయన తాజాగా చేసిన పని నెట్టింట వైరల్​ గా మారింది. సిఎం కేసీఆర్​ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వ అధికారి.. తాజాగా కేసీఆర్​ కాళ్ళు మొక్కుతూ ఓ వీడియోలో కనిపించారు. టిఆర్​ఎస్​ భవన్​ లో జరిగిన ఈ ఘటనపై మాజీ ఐఎఎస్​ ఆకునూరి మురళి స్పందిస్తూ.. ఎమ్మెల్యే టికెట్​ కోసం ట్రై చేస్తున్నారేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​