యేసు వల్లే కరోనావైరస్ వ్యాప్తి తగ్గిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస రావు అన్నారు. క్రిస్మస్ వేడుక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశంలో లేదా తెలంగాణలో ఆధునిక సంస్కృతికి క్రైస్తవులే వారసులు. లార్డ్ జీసస్ వల్లే కోవిడ్-19 తగ్గిందనే విషయం అందరికీ తెలుసు’ అని ఆయన మాట్లాడారు.