వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ని రద్దు చేస్తున్నట్లు యూరోపియన్ దేశం సెర్బియా ప్రకటించింది. ఇకపై వీసా ఉంటేనే తమ దేశంలోకి ఆహ్వానిస్తామని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ యూరోపియన్ దేశంలోకి భారతీయులు వీసా లేకుండానే వీలుండేది. యూరోపియన్ యూనియన్ లో మారిన వీసా రూల్స్ ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెర్బియా వెల్లడించింది. వీసా లేకుండా మా దేశంలోకి ఇప్పటికే వచ్చిన వారు కేవలం 30 రోజుల్లో తమ పర్యటనను ముగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.