బ్రిటన్​ లో సీరం భారీ పెట్టుబడులు

By udayam on May 4th / 5:16 am IST

భారత్​కు చెందిన సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ బ్రిటన్​లోనూ తమ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బ్రిటన్​లో 240 మిలియన్​ పౌండ్లను పెట్టుబడులు పెట్టడానికి అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని అక్కడ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​, క్లినికల్​ ట్రయల్స్​, వ్యాక్సిన్​ ఉత్పత్తి సెంటర్ల కోసం ఖర్చు చేయనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్​ తయారీదారైన సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఇప్పటికే ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్​ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​