విశాఖ వైపు దూసుకొస్తున్న అసాని

By udayam on May 9th / 6:52 am IST

దక్షిణ అండమాన్​ సముద్రంలో ఏర్పడ్డ అసాని తుపాను తన దిశను మార్చుకుని విశాఖ వైపు దూసుకొస్తోంది. ఈ వార్త రాసే సమయానికి విశాఖ తీరానికి ఆగ్నేయంగా 640 కి.మీ.ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రం నాటికి తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఆంధ్రా, ఒడిశా కోస్ట్​గార్డ్​ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య విశాఖ పట్నం వద్ద ఈ తుపాను తీరం దాటే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో గంటకు 50–60 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయి.

ట్యాగ్స్​