సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టడం కానీ, వారి వృత్తిలో జోక్యం చేసుకోవడం కానీ చేయవద్దని సుప్రీంకోర్ట్ ఈరోజు సంచలన తీర్పు చెప్పింది. సెక్స్ వర్కర్లదీ ఓ వృత్తేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, వారికీ చట్ట ప్రకారం అన్ని హక్కులూ, కనీస మర్యాదలు దక్కాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎల్నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం సెక్స్ వర్కర్ల రక్షణ కోసం ఆదేశాలు జారీ చేసింది. వారి అనుమతితోనే సెక్స్ జరుగుతున్నందన పోలీసులు కేసులు పెట్టొద్దని పేర్కొంది.