గుణశేఖర్ డైరెక్షన్లో క్రేజీ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ లీడ్ రోల్స్ లో నటించిన శాకుంతలం ట్రైలర్ వచ్చేసింది. కాళిదాసుడు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. యుక్తవయస్సులో దుశ్యంత మహారాజు ప్రేమలో పడడం, గర్భవతి అయిన శకుంతల తనను పెళ్ళి చేకొనమని అడగడానికి దుశ్యంతుడి రాజ్యానికి వెళ్ళడం, అక్కడ ఆమెకు అవమానం జరగడం అంతా కళ్ళకు కట్టినట్లు ట్రైలర్లో చూపించారు. దీనికి జత చేసిన భారీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సినిమాకు కావాల్సిన ఫీల్ ను తీసుకొచ్చాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.