ఆస్కార్ అవార్డు రేసులో ఆర్ఆర్ఆర్ నిలవడంపై షారూక్ ఖాన్ ట్విట్టర్లో స్పందించాడు. రామ్ చరణ్ ను ట్యాగ్ చేస్తూ అతడు తెలుగులో ట్వీట్ చేశాడు. ‘థాంక్యూ సో మచ్ మెగా పవర్ స్టార్. మీ ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ ని ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దాన్ని టచ్ చేయనివ్వండి’ అంటూ షారూక్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అప్పుడే ఈ ట్వీట్ కు 45 వేల లైకులు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ తో పాటు ఈరోజు కాంతార, వీఆర్, ది కశ్మీర్ ఫైల్స్, గంగూభాయి ఖతియావాడి సినిమాలకు ఆస్కార్ నామినేషన్లు దక్కిన సంగతి తెలిసిందే.
Of course @iamsrk Sir!
The award belongs to Indian Cinema❤️ https://t.co/fmiqlLodq3— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2023