విజయ్​ సేతుపతి, షాహిద్ ల వెబ్​ సిరీస్​ డేట్​ లాక్​

By udayam on January 7th / 6:45 am IST

మక్కల్​ సెల్వన్​ విజయ్​ సేతుపతి, బాలీవుడ్​ అగ్ర నటుడు షాహిద్​ కపూర్​ ల కాంబినేషన్​ లో తెరకెక్కిన వెబ్​ సిరీస్​ ‘ఫర్జి’ రిలీజ్​ డేట్​ ను అమెజాన్​ ప్రైమ్​ రివీల్​ చేసింది. ఫిబ్రవరి 10 నుండి ఫర్జి డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి ఉంటుంది పేర్కొంది. విడుదల తేదీని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ రెండు స్టైలిష్ పోస్టర్లను విడుదల చేశారు. కే కే మీనన్, రాశి ఖన్నా, అమోల్ పాలేకర్ మరియు భువన్ అరోరా ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు అని సమాచారం.

ట్యాగ్స్​