నిన్న జరిగిన భారత్, బంగ్లాదేశ్ ల తొలి వన్డేలో బంగ్లా వివాదాస్పద ఆల్ రౌండర్ షకీబల్ హసన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. న్డేల్లో టీమిండియాపై ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్గా రికార్డులకెక్కాడు. ఓవరాల్గా ఎనిమిదో స్పిన్నర్. గతంలో ముస్తాక్ అహ్మద్, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్, యాష్లే గైల్స్, అజంతా మొండిస్, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ ఈ ఘనత సాధించారు.నిన్నటి మ్యాచ్ లో భారత్ చేజేతులా క్యాచ్ లు వదిలేసి మ్యాచ్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే.