షాంఘై నగరంలో వ్యాపార కార్యకలాపాలపై గత 2 నెలలుగా విధించిన కోవిడ్ 19 లాక్‌డౌన్‌ను బుధవారం నుంచి ఎత్తేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌తో వ్యాపార వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో నగర ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ప్రణాళికలు కూడా ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు చైనా రాజధాని బీజింగ్‌లో పౌర రవాణా వ్యవస్థలు కొన్నింటిని పాక్షికంగా ప్రారంభించారు. షాంఘైలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.