4:48 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

`శంకర్‌దాదా ఎమ్.బి.బి.ఎస్` పార్టీ పిక్ వైరల్ 2 weeks ago

మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోపాటు మరికొందరు హీరోలు ఉన్న ఓల్డ్  ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్‌దాదా ఎమ్.బి.బి.ఎస్` మూవీ విడుదలై  తాజాగా  16 ఏళ్లు పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా ఈ ఫొటో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. `శంకర్‌దాదా ఎమ్.బి.బి.ఎస్` విజయవంతమైన సందర్భంగా అప్పట్లో మెగాస్టార్ పార్టీ ఇచ్చారట. ఆనాటి  ఫొటో ఇన్నేళ్ల తర్వాత వెలుగుచూసింది.  ఆ పార్టీకి హీరోలు మహేష్, ప్రభాస్, సుమంత్, తరుణ్, శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ మహేష్, జయంత్ తదితరులు హాజరయ్యారు.