తన పరపతిని ఉపయోగించి ట్విట్టర్ స్టాక్‌ను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై ట్విట్టర్ షేర్ హోల్డర్ ఒకరు ఎలన్ మస్క్‌పై దావా వేశాడు. ట్విట్టర్ కొనుగోలు కోసం అంటూ అతడు చేసిన ప్రకటనలు, ట్వీట్లు ఈ కంపెనీ షేర్ రేటును తగ్గించేందుకే నంటూ అతడు తన కేసులో పేర్కొన్నారు. ఈ మేరకు శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జిల్లా కోర్ట్‌లో ఈ కేసు నమోదైనట్లు ది వెర్జ్ రిపోర్ట్ చేసింది. అప్పట్లో 52 డాలర్లు ఉన్న షేర్ ఇప్పుడు ప్రస్తుతం 39.52 డాలర్లకు పడిపోయిందని అతడు వాపోయాడు.