కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్

By udayam on September 20th / 5:29 am IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌కు సోనియా గాంధీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సోమవారం సోనియాతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీఓ మరో నేత జైరాం రమేష్​ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ. ఖాళీగా ఉంటే ప్రెసిడెంట్ పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అభిప్రాయం కూడా అదే’ అని ఆయన తెలిపారు. దీంతో పాటు శశిథరూర్​కు పోటీగా రాజస్థాన్​ సిఎం అశోక్​ గెహ్లాత్​ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్​