రేపు బిజెపిలో కి మర్రి శశిధర్​ రెడ్డి

By udayam on November 24th / 9:38 am IST

ఇటీవలే కాంగ్రెస్​ కు గుడ్​ బై కొట్టిన మర్రి శశిధర్​ రెడ్డి శుక్రవారం ఢిల్లీలోని బిజెపి జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. మరోవైపు బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, మరి కొందరు సీనియర్ నేతలు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇచ్చిన అంశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్ర నేతలు వివరించే చాన్స్​ ఉంది.ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బిజెపి శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ నేతలకు వివరించనున్నారు.

ట్యాగ్స్​