5:41 pm
Tuesday, October 20, 2020

28°C
Vishakhapatnam, India

మోడీపై శేఖర్ కపూర్ షాకింగ్ ట్వీట్ 4 months ago

ముంబై: కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లకుండా అన్నీ  మోనటరింగ్ చేస్తున్న   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్న  లడక్ ప్రాంతానికి చేరడం సర్వత్రా చర్చకు దారితీసింది. పలువురు బాలీవుడ్ నటులు సైతం ఈ ఘటనపై ప్రసంసలు కురిపిస్తున్నారు. అలాగే  ప్రధాని లడఖ్  పర్యటనపై బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ప్రశంసలు కురిపించారు.

లేహ్, లడక్ ప్రాంతాలకు విమాన మార్గంలో ప్రయాణించిన వారు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల ఓ రోజు విశ్రాంతి తీసుకోవాలని అంతా చెబుతుంటారని అయితే మోదీ నేరుగా సైనికుల వద్దకు చేరుకుని ప్రసంగించారని శేఖర్ కపూర్ అభినందించారు.సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా శేఖర్ కపూర్ నిరంతరం స్పందిస్తూ ఉంటారు.

మోదీ వెళ్లిన నీము ప్రాంతం సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉంది. సైనిక బలగాల స్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపేందుకు మోదీ యత్నిస్తున్నారంటూ నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్‌‌కు శేఖర్ కపూర్ సమాధానమిస్తూ ట్వీట్ చేశారు. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా అకృత్యాన్ని శేఖర్ కపూర్ గతంలో ఎండగట్టారు.