ఢిల్లీ మేయర్​ పీఠంపై షెల్లీ ఒబెరాయ్​

By udayam on December 23rd / 12:42 pm IST

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి మేయర్​ పీఠాన్ని అదిరోహిస్తున్న ఆమ్​ ఆద్మీ పార్టీ ఇందుకోసం తన అభ్యర్థిని ఖరారు చేసింది. యర్ గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ గా మొహమ్మద్ ఇక్బాల్ పేర్లను పేర్కొంది. కౌన్సిలర్ గా షెల్లీ ఒబెరాయ్ తొలిసారి గెలుపొందారు. అంతకు ముందు ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. ఢిల్లీ మేయర్ గా మహిళకు అవకాశం ఇస్తామని ఇంతకు ముందే ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చెప్పినట్టుగానే మహిళకే మేయర్​ పీఠాన్ని కట్టబెట్టింది.

ట్యాగ్స్​