కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన ధావన్​

By udayam on May 4th / 5:45 am IST

పంజాబ్​ కింగ్స్​ సీనియర్​ బ్యాటర్​ శిఖర్​ ధావన్​ ఐపిఎల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న రాత్రి గుజరాత్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో 60 పరుగులతో నాటౌట్​గా ఉన్న అతడు తన కెరీర్​లో మొత్తం 49 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. దీంతో ఇప్పటి వరకూ 48 హాఫ్​ సెంచరీలతో భారత్​ తరపున అగ్రస్థానంలో ఉన్న కోహ్లీని ధావన్​ దాటేసినట్లయింది. కోహ్లీ 217 మ్యాచుల్లో 48 సార్లు 50 పరుగులు సాధించగా.. ధావన్​ 202 ఇన్నింగ్సుల్లోనే 49 సార్లు 50 పరుగులు సాధించాడు.

ట్యాగ్స్​