ధావన్​ ర్యాంకు మెరుగు

By udayam on July 22nd / 1:58 am IST

భారత జట్టు కొత్త కెప్టెన్​ శిఖర్​ ధావన్​ తన వన్డే ర్యాంకింగ్స్​లో 2 స్థానాలను మెరుగుపరుచుకుని 16వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో కెప్టెన్సీ ఇన్నింగ్స్​ ఆడి 86 పరుగులతో నాటౌట్​గా ధావన్​ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్​లో భారత్​ నుంచి కెప్టెన్​ కోహ్లీ 848 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా మరో సీనియర్​ ప్లేయర్​ రోహిత్​ శర్మ 817 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. 873 పాయింట్లతో పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ ఈ లిస్ట్​లో అందరికంటే ముందున్నాడు.

ట్యాగ్స్​