ధావన్​ను చితకబాదిన తండ్రి

By udayam on May 27th / 12:59 pm IST

క్రికెటర్​ శిఖర్​ ధావన్​ను ఆయన తండ్రి చితకబాదిన వీడియో వైరల్​ అవుతోంది. అయితే ఇదేదో నిజమైనది అనుకోకండి.. ఐపిఎల్​లో ధావన్​ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్​ జట్టు ప్లే ఆఫ్స్​ రేసు కు చేరుకోకపోవడంపై గబ్బర్​ ఈ విధంగా సరదా వీడియో చిత్రీకరించాడు. ‘పక్కవాళ్ళు ఆపుతున్నా సరే నా తండ్రి నన్ను చితకబాదాడు. నాకౌట్​కు చేరుకోనందుకు నాన్న చేతిలో నాకౌట్​ అయ్యా’ అంటూ ఈ వీడియోకు గబ్బర్​ కామెంట్​ పెట్టాడు. ఈ సిరీస్​లో 14 మ్యాచ్​లు ఆడిన ధావన్​ 460 పరుగులు చేశాడు.

 

ట్యాగ్స్​