పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా బుధవారం పురాతన శివలింగం బయటపడింది. పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి ముందు ఇక్కడ ఉన్న కొన్ని గ్రామాల్లో జనవాసాలు ఉండేవి. తాజాగా బయటపడిన శివలింగం ఆయా గ్రామాల్లోని ఆలయాలకు సంబంధించిందా? లేక ప్రాచీన శివలింగమా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం శివలింగాన్ని ప్రాజెక్ట్ ప్రాంతంలోనే ఉంచినట్లు కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.