పరుగుల యంత్రం శ్రేయస్​.. ఈ ఏడాది హయ్యస్ట్​ రన్​ స్కోరర్​ గా అయ్యర్​

By udayam on December 14th / 12:46 pm IST

భారత యువ క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​ ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​ గా రికార్డ్​ లకెక్కాడు. 2022 ఏడాదిలో అతడు 1489 రన్స్​ చేసి సూర్య కుమార్​ యాదవ్​ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. ఈరోజు బంగ్లాదేశ్​ తో మొదలైన తొలి టెస్ట్​ లో శ్రేయస్​ 86 పరుగులతో నాటౌట్​ గా ఉన్న విషయం తెలిసిందే. అయ్యర్​ తర్వాత సూర్యకుమార్​ 1424, కోహ్లీ 1304, రిషబ్​ పంత్​ 1278, రోహిత్​ శర్మ 995 రన్స్​ తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ట్యాగ్స్​