భారత క్రికెట్లో వర్థమాన తార, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ ధర పెట్టి లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. రూ.2.45 కోట్లతో అతడు మెర్సిడెజ్ ఎఎంజి జి–64 4మ్యాటిక్ను కొనుగోలు చేశాడు. ఇటీవలే డెలివరీ అయిన ఈ కారుతో అతడు దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 0–100 కి.మీ.ల వేగాన్ని కేవలం 4.5 సెకండ్లలో అందుకునే ఈ కారులో ఎఎంజి 4.0 లీటర్ వి8 బైటర్బో ఇంజిన్ ఉంటుంది.