బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. చిట్టోగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మూడో ఇన్నింగ్స్ (భారత్ కు రెండో ఇన్నింగ్స్) లో గిల్ 148 బాల్స్ లో 103 పరుగులు చేశాడు.ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన మెహదీ హసన్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ యువ క్రికెటర్ కు టెస్టుల్లో ఇదే తొలి శతకం. ప్రస్తుతం భారత్ 428 పరుగుల ఆధిక్యం (స్కోర్ 173/1 రెండో ఇన్నింగ్స్ లో) లో ఉంది.