సీధీ: మధ్యప్రదేశ్లోని సీధీలో గత మంగళవారం పాటన్ నదిలో బస్సు పడిన సంగతి తెల్సిందే. అయితే అప్పటి నుంచి దాదాపు వంద గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.
పాటన్ నదిలో 35 కిలోమీటర్ల దూరం వరకూ ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. 54వ మృతదేహాన్ని వెలికీ తీసుకురావడంతో సెర్చ్ ఆపరేషన్ ముగించారు. చివరిగా అరవింద్ విశ్వకర్మ మృతదేహాన్ని వెలికితీశారు.
ఈ మృతదేహం రీవా జిల్లా గోవింద్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమిలకీ గ్రామ నదీ తీరంలో లభ్యమయ్యింది. మృతుడు అరవింద్ విశ్వకర్మ ఘటన జరిగిన రోజు తన అత్త కూతురును ఎగ్జామ్ సెంటర్కు దిగబెట్టేందుకు సత్నా వెళుతున్నారు. అతని అత్త కూతురు మృతదేహం ఘటన జరిగిన రోజునే దొరకగా, అరవింద్ మృతదేహం ఐదు రోజుల తరువాత దొరికొంది.