కొత్త రికార్డ్​: సింగరేణిలో ఒకరోజు అత్యధిక ఉత్పత్తి

By udayam on December 22nd / 7:11 am IST

సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఉత్పత్తి నమోదు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ నెల 20న 2.14 లక్షల టన్నుల రోజువారీ ఉత్పత్తిని సాధించినట్లు వెల్లడించింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను తీర్చడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో నిరంతర విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ట్యాగ్స్​