ముగిసిన కెకె అంత్యక్రియలు

By udayam on June 2nd / 1:14 pm IST

బాలీవుడ్​ ప్లే బ్యాక్​ సింగర్​ కృష్ణకుమార్​ కున్నథ్​ (కెకె) అంత్యక్రియలు ఈరోజు బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలో ముగిశాయి. మంగళవారం రాత్రి కోల్​కతాలో ఓ కన్సర్ట్​లో పాటలు పాడిన ఆయన అనంతరం హోటల్​ రూమ్​లో అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం వెర్సోవా హిందూ స్మశాన వాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆయన భార్య రేఖ, నిర్మాత అశోక్​ పండిట్​, జావెద్​ అక్తర్​, శంకర్​ మహదేవన్​, ఉదిత్​ నారాయణ్​, శ్రేయా ఘోషల్​లు హాజరయ్యారు.

ట్యాగ్స్​