బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ కెకె మరణంపై పోస్ట్‌మార్టమ్ నివేదికలు వచ్చాయి. అతడికి తీవ్రంగా వచ్చిన గుండెపోటుతో పాటు దీర్ఘకాలంగా ఉన్న కాలేయ వ్యాధి, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యే అతడి ఆకస్మిక మరణానికి కారణమని తేల్చింది. అంతకుముందు ఆయన మరణానికి వేడి, ఉక్కపోతేఏ కారణమని అనుకుంటుండగా.. అతడి రక్త నాళాల్లో చాలా అడ్డంకులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. లైవ్ కన్సర్ట్‌లో ఎక్సైట్మెంట్ గురవ్వడంతో గుండెపోటు తీవ్ర స్థాయిలో వచ్చిందని వైద్యులు తెలిపారు.