తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు పాపులర్ పాటలను పాడిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నథ్ (కేకే) (55) మంగళవారం అర్థరాత్రి హఠాత్తుగా మరణించారు. కోల్‌కతాలో జరిగిన ఓ ప్రదర్శనలో పాటలు పాడి హోటల్‌కు చేరుకున్న ఆయన అక్కడ కుప్పకూలారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. గుండెపోటుతోనే ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. పవన్, మహేష్, చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్,ల సినిమాలకు ఆయన గాత్రం అందించారు.