హైదరాబాద్: మొత్తానికి టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత పెళ్లి అయింది. డిజిటల్ మీడియా వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదిక అయింది.
వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైనట్లు టాక్. అయితే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలినితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. సునీత, రామ్లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
సునీత 19 ఏళ్ళ వయస్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భర్తతో విభేదాల నేపథ్యంలో విడాకులు తీసుకుంది. ఇప్పటికే సునీత మెహందీ ఫోటోలను, ప్రీ వెడ్డింగ్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది తన కుమారుడు ఆకాష్, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.