ఆయన జ్ఞాపకాలతోనే ఆసీస్​లో రాణించా

తండ్రికి శ్రద్ధాంజలి ఘటించిన పేసర్​ సిరాజ్​

By udayam on January 21st / 10:36 am IST

ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగొచ్చిన ఫాస్ట్​బౌలర్​ మహ్మద్​ సిరాజ్​ ఈరోజు తన తండ్రి సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించారు. మహ్మద్​ సిరాజ్​ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే నవంబర్​ 20న ఆయన తండ్రి మరణించిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ సిరాజ్​ భారత్​కు తిరిగి రాకుండా బాధను దిగమింగుతూనే ఆ సిరీస్​ మొత్తం విశేషంగా రాణించిన విషయం తెలిసిందే.

తండ్రి చనిపోయిన రెండు నెలల తర్వాత ఆయన సమాధి వద్ద సిరాజ్​ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాడు.

దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. నా తండ్రి ఆశయం మేరకే నేను క్రికెట్​ను ఎంచుకున్నా. నాను క్రికెట్ ఆడడం ప్రపంచం మొత్తం చూడాలని ఆయన కోరిక. ఆయన కోరిక నెరవేర్చడం నాకు సంతోషాన్నిస్తోంది. ఆయన ఉండుంటే మరింత సంతోషించేవారు అని సిరాజ్​ పేర్కొన్నాడు.

అదే సమయంలో తాను ఆస్ట్రేలియా పర్యటనలో రాణించడం తనకెంతో సంతోషాన్ని ఇస్తోందని, అక్కడ ఉన్నంత కాలం తండ్రి చనిపోయారన్న వార్త నన్ను బాధించినా, సహచర సభ్యులు, కుటుంబ సభ్యులు నాలో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నాడు.