భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆతిధ్య జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందు మ్యాచ్ అనుభవాన్ని బట్టి ఈ పిచ్ పై సెకండ్ ఇన్నింగ్స్ ఎంత కష్టంగా ఉంటుందో అర్ధం చేసుకున్న ఆ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మరో వైపు భారత్ వైపు జట్టులో రెండు మార్పులు జరిగాయి. కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్ ల స్థానంలో అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ లు జట్టులోకి చేరారు.