సిరిసిల్ల మూడపల్లి గ్రామంలో ఈరోజు తెల్లవారుఝామున జరిగిన కిడ్నాప్ ఉదంతం కీలక టర్న్ తీసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే ప్రియుడితో కలిసి వెళ్ళి పెళ్ళి చేసుకున్నానని శాలిని సెల్ఫీ వీడియో ను విడుదల చేసింది. వారంతా మాస్క్ లు పెట్టుకోవడంతో తాను గుర్తించలేదని, ఆపై వచ్చింది తన ప్రియుడు జానీనే అని తెలిసి వెళ్ళి గుడిలో పెళ్ళి చేసుకున్నట్లు వివరించింది. ‘జానీతో నాలుగేళ్ళుగా తాను ప్రేమలో ఉన్నా. నా ఇష్టపూర్వకంగానే అతడు నన్ను తీసుకెళ్ళాడు. మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకున్నాం’ అంటూ సదరు యువతి వీడియో విడుదల చేసింది.
Twist in the Sircilla case. Woman who was allegedly kidnapped from Sircilla in Telangana releases a video saying she has now got married to her lover. Says she was in love with him for more than a year but parents refused to accept as he was a dalit. pic.twitter.com/E9ibJr90IZ
— Paul Oommen (@Paul_Oommen) December 20, 2022