తెలంగాణ: బుసారపు శ్రీనివాస్​ కు సిట్​ నోటీసులు

By udayam on November 18th / 4:49 am IST

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బూసారపు శ్రీనివాస్​ అనే వ్యక్తికి సిట్​ నోటీసులు అందించింది. ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ శ్రీనివాస్​ ను ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతికి ఫ్లయిట్ టికెట్లు కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ పై ఆరోపణల నేపథ్యంలో, అతడికి సిట్ అధికారులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. బుసారపు శ్రీనివాస్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడిగా భావిస్తున్నారు.

 

ట్యాగ్స్​