మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్ల వద్ద నకిలీ ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పత్రాలతో నమోదు చేసుకున్న కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు వైద్యుల్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేశ్ కుమార్, చేవెళ్లకు చెందిన శ్రీనివాసరావు, వరంగల్ కు చెందిన మహమ్మద్ ఫసీయుద్దీన్, లింగంపల్లికి చెందిన బి హరికఅష్ణా రెడ్డి, విజయవాడకు చెందిన మారుపిళ్ల శరత్ బాబు, విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట రాజ వంశీపై కేసులు నమోదు చేసింది. వీరంతా ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఉత్తీర్ణులు కాకుండానే సేవలు అందిస్తున్నట్టు గుర్తించారు.