సిరియాలోని రక్కా ప్రాంతంలో సోమవారం జరిగిన ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు సైనికులు మృతి చెందారు. ఈ దాడిలో ఒక ఆత్మాహుతి బాంబర్ మరణించగా, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కుర్దిష్ నేతృత్వంలోని ఒక భద్రతా దళంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. సిరియాలో 2014 వరకూ బలంగా ఉన్న ఐఎస్.. 2019 నుంచి ప్రభావాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఉనికిని చాటుకోవడానికి గెరిల్లా, ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది.