పాకిస్థాన్ లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఖైబర్ పంఖ్తుక్వా జిల్లాలోని వాండా షహాబ్ ఖేల్ ప్రాంతంలో డ్యూటీకి బయల్దేరిన పోలీసులపై బైకులపై వచ్చిన టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. అనంతరం మరణించిన పోలీసుల వద్ద నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్ళారు. లాండివా గ్రామంలో సెక్యూరిటీ నిమిత్తం పోలీసులు బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. బుధవారం హిలాల్ ఖేల్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో టెర్రరిస్టులు ఇద్దరు ఆర్మీ అధికారులను కాల్చి చంపారు.