కేంద్రం: పెయిడ్​ ప్రొమోషన్స్​ పై స్పష్టత ఉండాల్సిందే

By udayam on December 30th / 7:14 am IST

యూట్యూబ్ చానళ్లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ వేదికలపై భారీ ఫాలోవర్లు ఉన్న ఛానల్స్​ ఇకపై వారు ప్రొమోట్​ చేసే కంటెంట్​ పెయిడ్​ అని వెల్లడించకపోతే భారీ జరిమానాలు విధించనుంది ప్రభుత్వం. పెయిడ్ ప్రమోషన్ అని చెప్పకుండా వీడియోలు, పోస్ట్ లను పెట్టే వారిపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కి ఫిర్యాదు చేయవచ్చు. విచారణ అనంతరం నిజమని తేలితే కనుక ఆయా వ్యక్తులు, చానళ్లపై రూ.50 లక్షల జరిమానా పడుతుంది. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలు ఈనెల 24 నుంచి అమలులోకి వచ్చాయి.

ట్యాగ్స్​