సాల్మన్​ ఐలాండ్స్​ లో 7 తీవ్రతతో భారీ భూకంపం.

By udayam on November 23rd / 5:58 am IST

సోమవారం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం సృష్టించిన విలయతాండం మరవక ముందే మరో దేశంలోనూ భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్​ మహా సముద్రంలోని సాల్మన్​ ఐలాండ్స్​ లో మంగళవారం రాత్రి 7.0 తీవ్రతతో భూమి కంపించింది. భారీస్థాయిలో ప్రకంపనలు రావడంతో సాల్మన్ దీవుల రాజధాని హోనియారాలో భవంతులు తీవ్రంగా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాము భయంతో ఇళ్లను వీడి బయటకు పరిగెత్తినట్టు ప్రజలు వెల్లడించారు. దాదాపు 20 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగినట్టు తెలిపారు. భూకంపం ప్రభావంతో రాజధాని హోనియారా అంధకారంలో చిక్కుకుంది. ఆస్తి, ప్రాణ నష్టాలు వివరాలు తెలియరాలేదు.

ట్యాగ్స్​