తెలంగాణ సర్వీసు నుంచి ఆంధ్రప్రదేశ్ కు రిలీవ్ అయిన సీనియర్ ఐఎఎస్ సోమేశ్ కుమార్ గురువారం ఉదయం 11గంటలకు సిఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరారు. డివోపిటి ఆదేశాల మేరకు ఎపి సర్వీసులో జాయిన్ అవుతున్నానీ గురువారం ఉదయం తెలిపారు. సిఎం జగన్ ను కలిసిన తర్వాత సర్వీసుపై నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు.