మురారి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకుంది. అయితే ఆమె తన తర్వాతి చిత్రంలో జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించింది. ‘నేను జూ.ఎన్టీఆర్ మూవీలోనా? నాకింకా ఆ విషయం తెలియదు. కథ, క్యారెక్టర్ గురంచి కూడా మీరే చెప్పండి!’ అంటూ కోయిమోయి వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలూ వెల్లడించింది.