సిబిఐ: ఆస్థి కోసమే సోనాలీని చంపేశారు

By udayam on November 23rd / 12:44 pm IST

మాజీ నటి, హర్యానా బిజెపి నేత సోనాలీ ఫోగట్​ హత్య కేసులో సిబిఐ తన ఛార్జ్​ షీట్​ ను దాఖలు చేసింది. గోవా హోటల్​ రూమ్​ లో హత్యకు గురైన సోనాలీనీ ఆమె పిఎ, స్నేహితులే ఆస్తి కోసం చంపేశారని పేర్కొంది. ఈ మేరకు ఆమె పిఎ సుధీర్​ సంగ్వాన్​, స్నేహితుడు సుఖ్వీందర్​ లపై ఛార్జీ షీటులో పలు ఆరోపణలు చేసింది. వీరిద్దరిపై సెక్షన్​ 302 (హత్య), సెక్షన్​ 34, సెక్షన్​ 36 ల కింద కేసు నమోదు చేసింది. దాదాపు 1000 పేజీల ఛార్జీ షీటును గోవాలోని మపూసా కోర్ట్​ మేజిస్ట్రేట్​ కు సిబిఐ ఈరోజు అందించింది.

ట్యాగ్స్​