అభిమాని ఇంటికి వెళ్ళిన సోనూసూద్​

By udayam on January 19th / 10:17 am IST

హైదరాబాద్: తన పేరుతో సేవలందిస్తున్న ఓ అభిమాని ఇంటికి అగ్రనటుడు సోనూసూద్​ వెళ్ళి అతడిని ఆశ్చర్యపరిచాడు.

ఆత్మహత్యలకు పాల్పడ్డవారి శవాలను వెలికిస్తూ, ‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌’అని పేరుపెట్టి సేవలు అందిస్తున్న శివ ఇంటికి వెళ్ళిన సోనూసూద్​ అతడితో కాసేపు ముచ్చటించారు.

‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌’అని పేరుపెట్టి సేవలు అందిస్తున్న శివ ఈ అంబులెన్స్‌ ప్రారంభోత్సవానికి రావాలని సోనూసూద్‌ని ఇదివరకే ఆహ్వానించాడు.

అతని కోరిక మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సోనూసూద్‌.. అక్కడ శవాల శివ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు. శివ చేస్తున్న సేవలను సోనూసూద్‌ అభినందించాడు.

అంతే కాదు, భవిష్యత్తులో ఏమి కావాలన్న తాను ఉన్నానని శివకు భరోసా ఇచ్చాడు. ఇక ఈ అంబులెన్స్‌ సేవలను విస్తృతం చేస్తామని సోనూసూద్‌ చెప్పాడు.

కాగా ట్యాంక్‌బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్య చేసుకున్నవారి మృతదేహా లను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో శివ నిలిచాడు. అందుకే అతడికి శవాల శివ అనే పేరు వచ్చింది.