నెటిజన్ కామెంట్ కి సోనూసూద్ స్ట్రాంగ్ కౌంటర్

By udayam on October 27th / 6:04 am IST

రియల్ హీరోగా నటుడు సోనూ సూద్ ఎన్నో పనులు చేసి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చి వారి పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. అలాగే తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించారు. అయితే సోనూ సూద్ సాయం అంతా ఫేక్ అని తాజాగా ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా విమర్శించాడు.

‘‘కొత్త ట్విటర్ అకౌంట్. ఇద్దరు ముగ్గురు ఫాలోవర్లు. తన వైద్యానికి సహాయం చేయలంటూ ఒకే ఒక ట్వీట్. కనీసం సోనూను ట్యాగ్ చేయలేదు. లొకేషన్ చెప్పలేదు. కాంటాక్ట్ డిటైల్స్, ఈ మెయిల్ అడ్రస్ ఇవ్వలేదు. అయినా ఆ ట్వీట్‌కు సోనూ రిప్లై ఇచ్చాడు. ఇదెలా సాధ్యమో తెలియడం లేదు. అలాగే సహాయం కోరుతూ గతంలో చాలా ట్విటర్ హాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు ఇప్పుడు డిలీట్ అయిపోయాయి’’ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

అయితే దీనిపై సోనూ సూద్ స్పందించాడు. ‘‘అదే గొప్ప విషయం బ్రదర్. ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను గుర్తిస్తా. వారు నన్ను ఆశ్రయిస్తారు. అది చిత్తశుద్ధికి సంబంధించిన అంశం. అలాంటివి నీకు అర్థం కావు. రేపు పేషెంట్ ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో ఉంటాడు. నీకు సాయం చేయాలనిపిస్తే చేయి. అతడికి కొన్ని పండ్లు పంపించు. ఎంతో మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ప్రేమకు ఆ ఇద్దరు ఫాలోవర్లు ఉన్న వ్యక్తి సంతోషిస్తాడు’’ అని పేర్కొనడమే కాదు, ఆ రోగి వివరాలను కూడా సోనూ షేర్ చేయడం విశేషం.