సోనీలివ్​ కి ‘ఒకే ఒక జీవితం’ స్ట్రీమింగ్​ రైట్స్​

By udayam on October 4th / 7:47 am IST

శర్వానంద్​, వెన్నెల కిషోర్​, అమల అక్కినేని, ప్రియదర్శి, నాజర్​ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన మూవీ ఒకే ఒక జీవితం. బాక్సాఫీస్​ వద్ద సంచలన విజయం అందుకున్న ఈ మూవీ ఓటిటి ప్రయాణానికి సిద్ధమైంది. టైమ్​ ట్రావెల్​ కాన్సెప్ట్​లో వచ్చి ప్రేక్షకులతో ఈలలు వేయించిన ఈ మూవీ సోనీలివ్​ లో స్ట్రీమింగ్​ కానుంది. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్​ చేస్తున్నారన్న తేదీని ప్రకటించలేదు. సెప్టెంబర్​ 9న విడుదలైన ఈ మూవీతో శ్రీకార్తీక్​ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ట్యాగ్స్​