5వ టెస్ట్​ ఆడలేమన్నారు : గంగూలీ

By udayam on September 13th / 1:12 pm IST

ఇంగ్లాండ్​తో ఈనెల 10 నుంచి జరగాల్సిన 5వ టెస్ట్​ రద్దు కావడంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ స్పందించాడు. జట్టు సహాయక సిబ్బంది, కోచ్​లు కరోనా బారిన పడడంతో ప్లేయర్లంతా ఆరోగ్యం విషయంలో బయపడ్డారని తెలిపాడు. 5వ టెస్ట్​ను ఆడలేమని ప్లేయర్లు మాకు చెప్పడంతోనే ఇంగ్లాండ్​ బోర్డ్​తో చర్చలు జరిపి చివరి టెస్ట్​ను రద్దు చేశామని ప్రకటించారు. ‘ప్లేయర్లు ఆడలేమని స్పష్టంగా చెప్పేశారు. అందులో వారి తప్పేం లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి’ అని గంగూలీ టెలిగ్రాఫ్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ట్యాగ్స్​