దాదా బయోపిక్​లో తనే హీరోగా చేస్తున్నాడా??

By udayam on September 24th / 12:38 pm IST

భారత మాజీ కెప్టెన్​, బిసిసిఐ ప్రెసిడెంట్​ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో గంగూలీనే నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గంగూలీ పాత్రకు రణ్​బీర్​ను డైరెక్టర్​ లవ్​ రాజన్​ సంప్రదిస్తే.. క్రికెట్​ కంటే ఫుట్​బాల్​ ను ఇష్టపడతానని,‘సంజు’ తర్వాత బయోపిక్​ల జోలికి వెళ్ళకూడదనుకున్నట్లు అతడు చెప్పాడట. దీంతో బెంగాల్​ నటుడు పరంభ్రతా ఛటర్జీని సంప్రదిస్తే నిర్మాతలు పాన్​ ఇండియా ఇమేజ్​ నటుడే కావాలని డైరెక్టర్​తో చెప్పారట. దీంతో గంగూలీనే నటించమని అడగడానికి డైరెక్టర్​ సిద్ధమవుతున్నాడు.

ట్యాగ్స్​