ఢిల్లీ క్యాపిటల్స్​: ఐపిఎల్​ లోకి మళ్ళీ దాదా!

By udayam on January 3rd / 11:20 am IST

ఇటీవలే బిసిసిఐ ప్రెసిడెంట్​ పదవి నుంచి దిగిపోయిన క్రికెట్​ లెజెండ్​ సౌరవ్​ గంగూలీ మరోసారి క్రికెట్​ పాలనా వ్యవహారాల్లో బిజీ కానున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్​ కోసం ఢిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు హెడ్​ ఆఫ్​ క్రికెట్​ డైరెక్టర్​ గా వ్యవహరించనున్నాడు. ఇదే జట్టుకు గంగూలీ 2019లో సలహాదారుగానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది బిసిసిఐ ప్రెసిడెంట్​ కావడంతో ఢిల్లీని వదిలేసిన దాదా ఇప్పుడు మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్​ తరపున పనిచేయనున్నాడు.

ట్యాగ్స్​